కీలక సమాచారం అందిస్తే రూ. 10 లక్షల రివార్డు : ఎన్‌ఐఏ

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి కీలక సమాచారం తెలిపిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ నగదు రివార్డును ప్రకటించింది. కీలక సమాచారం అందించిన వారికి రూ.10 లక్షల రివార్డును అందిస్తామని ఎన్‌ఐఏ తెలిపింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.