కుంభమేళా సందర్భంగా పర్యావరణంపై ప్రత్యేక సమావేశం : రాష్ట్రాల ముఖ్యమంత్రుల హాజరు

లక్నో : ఈ  నెలలో అలహాబాదులో జరగనున్న మహా కుంభమేళా సందర్భంగా పర్యావరణంపై ప్రత్యేకంగా రెండు రోజుల సమావేశం ఏర్పాటుచేయనున్నారు.  గంగానది పరిరక్షణకు సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తారు. జనవరి 18,19 తేదీల్లో జరిగే ఈ సమావేశాల్లో గంగానది పవిత్రతను కాపాడడానికి తీసుకోవలసిన చర్యల గురించి, నది పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పర్యావరణ అసమతౌల్యం గురించి  చర్చలు జరుపుతారని రిషికేశ్‌కి చెందిన చిదానంద సరస్వతి ప్రకటించారు. చర్చల పరిణామాల్ని ఒక ప్రకటన రూపంలో విడుదలచేస్తామన్నారు. గంగానది ప్రవహించే  రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఈ సమావేశానికి హాజరవుఉతారని స్వామి చిదానంద తెలిపారు.