కుక్కల దాడిలో 30 గొర్రెల మృతి

మెట్‌పల్లి గ్రామీణం: మండలంలోని వేంపేట గ్రామంలో జెల్ల చిన్న రాములు అనే వ్యక్తికి సంబంధించిన గొర్రెల మందపై మంగళవారం రాత్రి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో దాదాపు 30 గొర్రెలు మృతి చెందాయి. దాదాపు రు.2లక్షలు నష్టం జరిగనట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.