కుటుంబ కలహలతో ఉరేసుకుని హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌ : సిటీ సెక్యురిటీ వింగ్‌లో విధులు నిర్వహిస్తున్న రామారావు అనే హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సరూర్‌నగర్‌లోని తహసీల్దారు కార్యాలయం సమీపంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని అతను ఈ ఘటనకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగానే రామారావు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.

తాజావార్తలు