కూతుర్ని హింసించిన తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష

నెల్లూరు : నెల్లూరు నగరంలో రెండు సంవత్సరాల క్రితం ప్రయుడితో కలిసి సొంత కూతురిని హింసించిన తల్లికిరెండో అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.72 వేల జరిమానాను విధించారు. చైతన్య అనే మహిళ తన ప్రియుడితో కలిసి యూకేజీ చదువుతున్న సొంత కూతురు నర్తనను చిత్రహింసలకు గురిచేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమె ప్రియుడు నగేష్‌కు కూడా చైతన్యకు విధించిన శిక్షనే విధించారు.