కెసిఆర్ మనసులో సమైక్యాంధ్ర…. బయట మాత్రం తెలంగాణ:మోత్కుపల్లి
హైదరాబాద్: నవంబర్ 14,(జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు అసలు రంగును ప్రజలు తెలుసుకున్నారని తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కెసిఆర్ తెలంగాణ ద్రోహి అని తెలంగాణ వాదాన్ని అమ్ముకున్న ఘనత ఆయనదే అన్నారు. కెసిఆర్ మనసులో సమైక్యాంధ్ర…. బయట మాత్రం తెలంగాణ అని ఆపార్టీ నేతలే అంటున్నారని విమర్శించారు.. తెలంగాణ ప్రజల మనోబావాలతో కెసిఆర్ వ్యాపారం చేస్తున్నారని. ఆయన తెలంగాణ తెస్తానంటే నమ్మేవారు లేరన్నారు.100 అసెంబ్లీ, 15 పార్లమెంట్ స్థానాల్లో గెలిస్తే కెసిఆర్ వాళ్లను అమ్ముతారని అన్నారు. అఖిలపక్షం నిర్వహించమని కెసిఆర్ ఎప్పుడైనా అడిగారా అని ప్రశ్నించారు.



