కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి ..

.. టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి శేర్ నర్సారెడ్డి డిమాండ్. . కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి శేర్ నర్సారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మంగళవారం నాడు విలేకరులతో శేర్ నర్సారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 75 కోట్లకు పైగా జనాభా ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు . అన్ని సామాజిక వర్గాలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖలు ఉన్నాయని , దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయని , కానీ కేంద్రంలో ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు . కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి స్కాలర్ షిప్ పథకం , ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం , ప్రత్యేక నవోదయ పాఠశాలలు , కుల వృత్తులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు . బీసీ జనాభా సేకరించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాలకు ఉందని గుర్తు చేశారు . దేశవ్యాప్తంగా బీసీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణమే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని , జన గణనలో కుల గణన చేపట్టి బీసీలకు జనాభా ప్రాతిపదికన నిధులు , ఉద్యోగాలు కల్పించాలని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి శేర్ నర్సారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .