కేంద్ర ప్రభుత్వానికి కోదండరాం హెచ్చరిక

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం హెచ్చరిక చేశారు. ఈ నెల 29లోపు తెలంగాణ ప్రకటించకపోతే మిలిటెంట్‌ తరహా ఉద్యమాలు చేయడానికి సిద్ధమని ఆయన తేల్చిచెప్పారు. రహస్యంగా చర్చలు జరిపి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.