కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీయూలో ఉన్నాయి : సురవరం
హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెజార్టీ కోల్పోయి ఐసీయూలో ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. విద్యుత్ ఉద్యమంతో కిరణ్ కుమార్‌రెడ్డి అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్, భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాడుతుందని జోస్యం చెప్పారు.


