కేజేపీని ప్రారంభించిన యడ్యూరప్ప

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ మాజీ నేత యడ్యూరప్ప ఈరోజు తన కొత్త పార్టీ కర్ణాటక జనతా పార్టీని ప్రారంభించారు. ఉత్తర కర్ణాటకలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రసంగించారు. అంతకు ముందు ఆయన 21 మంది భాజపా ఎమ్మెల్యేలు, 7గురు ఎమ్మెల్సీలు, నలుగురు ఎంపీలకు ఉదయం విందు ఏర్పాటుచేశారు. ర్యాలీకి ముందు మాట్లాడుతూ ఆయన రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కేజేపీ-బీజేపీ సంకీర్ణమని వ్యాఖ్యానించారు. తన  మద్దతుదారులపై చర్యలు తీసుకోవడం మానుకోవాలని హెచ్చరించారు.