కేసీఆర్‌ నివాసానికి కేకే

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేకేశవరావు ఇవాళ టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇంటికి వెళ్లారు. కేసీఆర్‌తో సమావేశమైన కేకే పార్లమెంట్‌ సమావేశాల వ్యూహం, తెలంగాణ ఉద్యం కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ కేకే తన నివాసంలో మంత్రి జానారెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో సమావేశమైన అనంతరం నేరుగా కేసీఆర్‌ ఇంటికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.