కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారు
– అఖిలపక్షాన్ని తక్షణమే ఢిల్లీ తీసుకెళ్లాలి
– ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ
హైదరాబాద్, నవంబర్7(జనంసాక్షి) : ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ మొసలికన్నీరు కారుస్తున్నారని
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్మార్పీస్ కార్యకర్త భారతి మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని మండిపడ్డారు. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో భారతి మృతదేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని, మాటలతోనే కాలం వెల్లదీసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్‌కు నిజంగా ప్రేమ ఉంటే, సమస్యను పరిష్కరించి మాదిగలకు న్యాయం చేయాలని అనిపిస్తే కేసీఆర్ తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డీమాండ్ చేశారు. కేంద్రంపై పోరాడి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టేలా కృషిచేయాలన్నారు. అప్పుడే కేసీఆర్ మాటలకు మేము విలువనిస్తామన్నారు.



