కొనసాగుతున్న తెలంగాణ వాదుల అరెస్టులు
హైదరాబాద్: తెలంగాణ మార్చ్ దృష్ట ఉద్యమకారుల అరెస్టులు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లాలో 100 మందిని, నిజామాబాద్ నుంచి 160 మందిని నల్గొండలో 120 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేసినట్లు సమాచారం. నల్లగొండ జిల్లాలో పోలీసులు జులూం ప్రదర్శిస్తున్నారు. ఐడీ కార్డులు చూపించాలని సామన్య జనాన్ని పోలీసులు వేధిస్తున్నారు. జిల్లాలో నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పలువురు తెలంగాణ వాదులను అరెస్టు చేస్తున్నారు.



