కోక్రాఝార్ జిల్లాలో కర్ఫ్యూ సడలింపు
గౌహతి: అసోంలో హింస చెలరేగిన కోక్రాఝార్ జిల్లాలో నేడు కర్ఫ్యూ సడలించారు. ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలియజేశారు. జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన అల్లర్లలో నలుగురు మృతి చెందారు. దీంతో గత పది రోజుల నుంచి జరుగుతున్న అల్లర్లలో మృతుల సంఖ్య 10కి చేరింది.



