కోటా బిల్లుకు వ్యతిరేకంగా యూపీలో ఆందోళన

లక్నో : పదోన్నతుల్లో ఎస్సీ,, ఎస్టీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ ఆందోళనకు దిగింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ కోటా బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడంపై ఆపార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. వారణాసి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు పలు రైళ్లను నిలిపివేశారు. ఎస్పీ కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈబిల్లును రాజ్యసభలో ఎస్పీ సభ్యులు గట్టిగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.