కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కేకే భేటీ

హైదరాబాద్‌: మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. కేశవరావు భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బ్రదర్స్‌ మధ్య మాటల యుద్ధం ముదురుతున్న విషయం తెలిసిందే.