క్యాబ్‌ డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తాం

బిజెఎమ్మెల్యే ప్రభాకర్‌ ప్రస్తావనపై నాయిని హావిూ
ల్గ/దరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి):  ఓలా, ఉబెర్‌ క్యాబ్‌ డ్రైవర్ల సమస్యలపై మరోమారు చర్చించి పరిస్కారం కనుగొంటామని ¬ంమతం/-ఇర నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలో హావిూ ఇచ్చారు. వారి సమస్యలపై గతంలో ఓ మారు చర్చించామని, మళ్లీ చర్చించి సమస్యలను అద్యయనం చేస్తమాని అన్నారు. జీరో అవర్‌లో ఈ సమస్యను ప్రస్తావిస్తూ డ్రైవర్ల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని భాజపా
ఎమ్మెల్యే ప్రభాకర్‌ విమర్శించారు. గత శాసనసభ సమావేశాల్లో క్యాబ్‌ డ్రైవర్లకు న్యాయం చేస్తామని ప్రకటించిన రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఇప్పటివరకు ఆ హావిూని పట్టించుకోలేదని ఆరోపించారు. డ్రైవర్లకు రావాల్సిన కమిషన్‌ కూడా ఓలా, ఉబెర్‌ సంస్థలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. క్యాబ్‌ డ్రైవర్ల సమస్యలు తెలుసుకోవడానికే తాను ఓలా క్యాబ్‌లో అసెంబ్లీకి వచ్చానని, ప్రభుత్వం వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ఎందరో డ్రైవర్లు ఓ,ఊబర్‌లను నమ్మి రుణలు తీసుకుని వాహనాలుకొనుక్కున్నారని అన్నారు. వారికి ఇవ్వాల్సిన కమిషన్‌ ఇవ్వక పోవడంతో అప్పులు కట్టలేక కొందరు ఆత్మహత్యయాత్నాలకు పాల్పడ్డారని అన్నారు. ప్రభతు/-వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని అన్నారు. తకకువ ధరలకు వారునగరంలో ప్రయాణికులను చేరవేస్తూ సమాజసేవ చేస్తున్నారని అన్నారు.