క్యూబిక్‌ మీటర్‌ ఇసుక ధర రూ.325

హైదరాబాద్‌: ఇసుక నూతన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. క్యూబిక్‌ మీటర్‌ ఇసుకకు రూ.325గా నిర్ణయించినట్లు మంత్రి గల్లా అరుణకుమారి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయనున్నట్లు … అంతరాష్ట్ర ఇసుక రవాణపై నిషేధం విధించినట్లు చెప్పారు.  నదీపరివాహక ప్రాంతాల్లో పొక్లెయిన్‌ వినియోగాన్ని నిషేదించినట్లు చెప్పారు. ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన 100 శాతం రాయల్టీ జడ్పీ ఖాతాకు జమకానున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో  రాతి ఇసుక ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు.