ఖజానా ఉద్యోగుల సమ్మె విరమణ

హైదరాబాద్‌: ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో ఖజనా ఉద్యోగుల చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. చర్చలు ఫలిచడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. 12 డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఐదు రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 13 జిల్లాల పరిధిలో ఖజనా ఉద్యోగులు పని నిరాకరణ సమ్మె విరమించారు.