ఖమ్మంలో ప్రశాంతంగా ముగిసిన జేఈఈ పరీక్ష

ఖమ్మం: ఏఐఈఈఈ, ఐఐటీలలో ప్రవూశానికి ఖమ్మంలో నిర్వహించిన జేఈఈ పరీక్షకు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ఉదయం 9.30 నుంచి 12.30వరకూ జరిగిన మొదటి పేపరు పరీక్షకు 6,544 విద్యార్థులకు గాను 6,280 మంది హజరయ్యారు. 264 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సామంత్రం 5.30 వరకూ జరిగిన రెండో పేపరు పరీక్షకు 2,532 మందికి గాను 2,314 మంది హాజరయ్యారు. 218మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలు నిర్వహించిన తీరును సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెంకడరీ ఎడ్యుకేషన్‌ న్యూఢిల్లీ సహాయ కార్యదర్శి సునీల్‌ లాల్‌, చెన్నై కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ సుందరం, ప్రోగ్రామర్‌ రవి, తదితరులు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్టు జిల్లా సమన్వయ కర్త పార్వతీ రెడ్డి తెలిపారు.