గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం : తెదేపా

న్యూఢిల్లీ : తెలంగాణపై గతంలో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని అఖిలపక్ష భేటీలో చెప్పినట్లు తెదేపా ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ సమస్యకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని కేంద్రానికి తెలిపినట్లు భేటీ అనంతరం ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు మీడియాతో ఆన్నారు. కేంద్ర  హోంమత్రికి పార్టీ తరపున లేఖ అందించినట్లు తెలియజేశారు.