గన్నవరంలో సీఎం ఇందిరమ్మబాట ప్రారంభం

విజయవాడ: కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాలో మూడు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గన్నవరంలో రహదారికి సీఎం శంకుస్తాపన చేశారు.