గాంధీభవన్‌ ముట్టడికి విద్యార్థుల యత్నం

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఓయూ విద్యార్థులు గాంధీభవన్‌ ముట్టడికి యత్నించారు. ముట్టడికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాల్లో డీసీసీ కార్యాలయాలను విద్యార్థులు ముట్టడించారు.