గాంధీ ఆసుపత్రిలో కొనసాగుతున్న దీక్షలు
హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద దీక్ష భగ్నం అనంతరం వామపక్ష పార్టీల నేతలు గాంధీ ఆసుపత్రిలో నిరసన కొనసాగిస్తున్నారు. నాలుగు రోజులుగా నిరవధికి నిరాహార దీక్ష చేస్తుండటంతో నిరాయణ, రాఘవులతోపాటు పలువురి నేతల ఆరోగ్యం క్షీణించింది. దీంతో పోలీసులు వారిని బలవంతంగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే నేతలు ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేందుకు నిరాకరించి దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఉద్యమకార్యాచరణపై చర్చించేందుకు పది వామపక్ష పార్టీల నేతలు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు.


