గుజరాత్‌లో ముగిసిన పోలింగ్‌

గుజరాత్‌: గుజరాత్‌లో రెండో దశ ఎన్నికల పోలీంగ్‌ ప్రక్రియ ముగిసింది. రెండో విడతలోనూ గుజరాతీయులు భారీగా పోలింగ్‌లో పాల్గొని ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలివిడతలో 68 శాతం పోలింగ్‌ నమోదైన సంగతి తెలిసిందే. 182 నియోజకవర్గాలకు రెండు విడతలుగా పోలింగ్‌ నిర్వహించారు. ఈ నెల 20న ఉదయం 8 గంటలనుంచి గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.