గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం

అహ్మదాబాద్‌ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాలకు  జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభం అయింది. గుజరాత్‌లో 182, హిమాచల్‌ ప్రదేశ్‌లో 68 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.గుజరాత్‌లో 1,666 అభ్యర్థులు, హిమాచల్‌ప్రదేశ్‌లో 459 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.