గురుకుల పాఠశాలలో ప్రబలిన విష జ్వరాలు

నిర్మల్‌ : పట్టణంలో సోఫినగర్‌ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో వందికి పైగా విద్యార్థులు జ్వరాల బారిని పడ్డారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్సలను అందజేశారు. ఇతర విద్యార్థులకు జ్వరాలు సోకకుండా జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులను ముందు జాగ్రత్తగా ఇళ్లకు పంపించివేశారు.