గురువు లేనిదే విద్య లేదు..విద్య లేనిదే జ్ఞానం లేదు…దొడ్ల వెంకటేష్ గౌడ్…
కూకట్ పల్లి (జనంసాక్షి):గురువు లేనిదే విద్య లేదు..విద్య లేనిదే జ్ఞానం లేదు.. జ్ఞానం లేకపోతే ఈ లోకం మనుగడే ఉండదు అని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు.సోమవారం జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా డివిజన్ పరిధిలోని ఇంద్రాహిల్స్ కాలనీ స్నేహ మోడల్ స్కూల్ లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా ఆయన హాజరై
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమలవేసి, పాఠశాల ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని గురువులకు ఇస్తారని అందుకే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మమత రాజ్, కాస్పాండెంట్ ఎం.రాజు, డాక్టర్ రవి, పోశెట్టిగౌడ్, రేణుక, వనజ, శారద, కృప, నాగమణి, సోని, ప్రీతి, సాయి ప్రియ, రోజమ్మ తదితరులు పాల్గొన్నారు.