గెల్లు గెలుపుతో ఈటెల పతనం ఖాయం

share on facebook


ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా
వరంగల్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌ గెలుపుతో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పతనం ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో భాగంగా ఆయన కమలాపూర్‌ మండలం అంబాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. హుజూరాబాద్‌లో గెల్లు గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అపారమైన నమ్మకం ఉందని చెప్పారు. గెల్లు గెలుపుతో ఈటల పతనం ప్రారభమవుతుందని పేర్కొన్నారు. దళిత బంధు పథకం చారిత్రాత్మక నిర్ణయమని వెల్లడిరచారు. రాష్ట్రంలోని దళిత సోదరులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు.

Other News

Comments are closed.