గోవా నుంచి ఎయిర్‌ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది

గోవా: గోవా నుంచి హైదరాబాద్‌ రావల్సిన ఎయిర్‌ ఇండియా విమానానికి శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. గోవా విమానాశ్రంలో రన్‌వేపై టేకాఫ్‌ చేస్తుండగా విమానం డోర్‌ ఊడిపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ప్రయాణికులు ఆందోళన చెందారు. పైలెట్‌ ఆప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా కిందకు దించాడు. 200మంది ప్రయాణికులను విమానంలో నుంచి తరలించారు. ఇదే విమానంలో సినీ సంగీత దర్శకుడు రమణ గోగుల కూడా ప్రయాణిస్తున్నారు.

తాజావార్తలు