గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్లా, డ్రైవర్‌కు గాయాలు

కోరుకొండ : తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద ఈ రోజు ఉదయం ఓ గ్యాస్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయపడ్డాడు. గ్యాస్‌ ట్యాంకర్‌ నుంచి గ్యాస్‌ లీకు అవుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ నుంచి రాజమండ్రి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అక్కడకు చేరుకుని గ్యాస్‌ లీక్‌ ను అరికట్టేందుకు యత్నిస్తున్నారు.