గ్రూప్-1 ఫలితాలు ప్రకటించవద్దు: ఏపీపీఎస్సీని ఆదేశించిన రాష్ట్ర పరిపాలన ట్రైబ్యునల్
హైదరాబాద్: గ్రూప్-1 ఫలితాలను ప్రకటించవద్దని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రాష్ట్ర పరిపాలన ట్రైబ్యునల్ ఆదేశించింది. గ్రూప్ -1 కీలో తప్పులున్నాయన్న పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని కూడా కమిషన్‌ను ఆదేశించింది. ఈ పిటిషన్లపై విచారణను ట్రైబ్యునల్ వచ్చే నెలకు వాయిదా వేసింది.



