గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యలయంలో సంతకాల సేకరణ

హైదరాబాద్‌ :విద్యుత్‌ చార్జీల పెంపుపై తేదేపా సంతకాల సేకరణ కొనసాగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యాలయంలో ఆ పార్టీ నేత తలసాని శ్రీనివాసయాదవ్‌ సంతకాల సేకరణను ప్రారంభించారు. రేపటి నుంచి గ్రేటర్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.