ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

share on facebook

అశ్వరావుపేట నవంబర్ 19 ( జనం సాక్షి)

అశ్వారావుపేట నియోజకవర్గంలో ములకలపల్లి మండలం ఆనందపురం లో గుర్రం కృష్ణమూర్తి అధ్యక్షతన ఇందిరాగాంధీ105వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా జడ్పిటిసి సున్నం నాగమణి హాజరయ్యారు.భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమం ఉద్దేశించి సున్నం నాగమణి మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా ,ఎన్నో సేవలు అందించిన మహిళా శక్తిని దేశానికి చాటిన ధీరురాలు శ్రీమతి ఇందిరా గాంధీ అని కొనియాడారు . ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆ వీర నారీమణునికి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎండి అంజుమ్ మండల మైనార్టీ అధ్యక్షులు , బూరుగుపల్లి పద్మశ్రీ మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలు , గుర్రం జయసుధ, గుర్రం కృష్ణమూర్తి , కోండ్రు మల్లేష్, ఉయ్కే భద్రమ్మ , ఉయ్కే కాంతమ్మ , కొండ్రు లక్ష్మి , సోయం మధులత , కొరస విజయలక్ష్మి , ఊ కే రాజేశ్వరి , సున్నం లక్ష్మి, కోండ్రు సుశీల , ఊకే లక్ష్మి , ఊకే ముత్తమ్మ , ఊకే పాంచాలి , కోండ్రు చిట్టమ్మ , సరిత , స్వయం నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.