ఘనంగా గ్రామదేవతలకు బోనాలు

share on facebook
గౌడ సంఘం ఆధ్వర్యంలో ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు
జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రం కొల్చారం  లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు  గౌడ సంఘం ఆధ్వర్యంలో  మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. పెళ్లిరోజు శుక్రవారం నాడు  గణపతి పూజ, పుణ్యాహవచనం, అమ్మవారి అభిషేకం అర్చన ప్రత్యేక పూజలు  గ్రామ పురోహితులు కోలాచల సుప్రియ శ్రీనివాస్ శర్మ  దంపతులు, ఆలయ పూజారి చల్లూరి కృష్ణ శర్మ  మంత్రోత్సహరణల మధ్య ఘనంగా జరిపారు.  సాయంత్రం పోచమ్మ దుర్గమ్మ లకు అందంగా అలంకరించిన బోనాలను  ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ  శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పుచప్పుల మధ్య అమ్మవాళ్లకు  బోనాలను సమర్పించారు.  ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం  రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి  శ్రీశ్రీశ్రీ మాధవ నంద సరస్వతి స్వామి ఆశీస్సులతో జరుపుకుంటున్న మని  తెలిపారు. వార్షికోత్సవ కార్యక్రమంలో మొదటి రోజు గణపతి పూజ, గ్రామ దేవతలకు బోనాలు, రెండవ రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం, మూడవరోజు శ్రీ రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉమా రాజా గౌడ్, ఎంపిటిసి అరుణా కృష్ణా గౌడ్,రామకృష్ణ గౌడ్,కిరణ్ గౌడ్,దుర్గా గౌడ్,వెంకట్ గౌడ్, రామా గౌడ్,సోమలింగం గౌడ్,అశోక్ గౌడ్, శివకుమార్ గౌడ్,పాపా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఉపేందర్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, దుర్గాప్రసాద్  గౌడ్, అరుణ్ గౌడ్,సుధాకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.