ఘనంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
ఆత్మకూర్(ఎం) ఆగస్టు 20 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 78వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించార ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మండల అధ్యక్షుడు యాస లక్ష్మరెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండా మంగమ్మ శ్రీశైలం జెడ్పీటీసీ నరేందర్ గుప్తా పిఎసిఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు జన్నాయికోడె నగేశ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దీగోజు నర్సింహాచారీ ఉప సర్పంచ్ దొంతరబోయిన నవ్య భాస్కర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతాగాని మల్లేష్ ఓబీసీ సెల్ అధ్యక్షులు బత్తిని ఉప్పలయ్య ఎస్సి సెల్ అధ్యక్షులు నగేశ్ మండల నాయకులు యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు