ఘనంగా మహిళ డిగ్రీ కళాశాలలో కాళోజి జయంతి వేడుకలు

: శామీర్ పేట్, జనంసాక్షి :
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ జగద్గిరిగుట్ట కళాశాలలో తేదీ శుక్రవారం రోజున తెలుగు విభాగం ఆధ్వర్యంలో కాళోజి జయంతి పురస్కరించు కొని తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కాలోజీ జీవిత విశేషాలను అలాగే తెలంగాణ భాష యాసలకు సంబంధించిన గొప్పతనాన్ని కాళోజి రచనల గొప్పతనాన్ని మరియు అతని జీవిత విశేషాలను తెలుగు విభాగం హెచ్ వో డి వి.హర్షిత విద్యార్థులకు తెలియజేశారు. అలాగే కాళోజి జీవిత విశేషాలకు సంబంధించినటువంటి వీడియోలను, తెలంగాణ భాషా సంబంధిత వీడియోలను, కాళోజి ప్రసంగాలను ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు చూపించారు . విద్యార్థులు తెలంగాణ భాష గొప్పదనాన్ని తెలియజేసేటటువంటి పాటలు నృత్యంతో అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి, తెలుగు విభాగం అధ్యాపకురాలు హర్షిత, ఉమారాణి మరియు స్రవంతి, అనురాధ మొదలైన అధ్యాపకులు ఫిజికల్ డైరెక్టర్ అరుంధ, విద్యార్థినులు, తదితరులు
పాల్గొన్నారు.
9ఎస్పీటీ -1: కాళోజి కి నివాళులు అర్పిస్తున్న కళాశాల బృందం