చంద్రబాబుతో సహా పార్టీకి చెందిన కార్యకర్తల అరెస్ట్
హైదరాబాద్: ఫీజు రియింబర్స్‌మెంట్ విషయంలో పేద విద్యార్థులకు ప్రభుత్వం చేస్తున్న అన్నాయానికి నిరసనగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎల్‌బీనగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు.. బీసీలకు పూర్తిగా ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ వ్యక్తం చేస్తూ చౌరస్తాలో బాబు బైఠాయించారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో బాబుతో సహా పార్టీకి చెందిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని వసస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.



