చంద్రబాబునాయుడుపై కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకే తారక రామారావు ఫైర్‌ అయ్యారు. అధికారం కోసం ఆయన చేపట్టిన పాదయాత్రను ప్రజలు విశ్వసించరని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ‘ అసలు ఆయన పాదయాత్ర ఎవరి కోసం చేస్తున్నారో.. ఎందుకోసం చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. బాబు పాదయాత్రకు ‘ వస్తున్నా మీకోసం ‘ కాకుండా ‘ చస్తున్నా కుర్చీ కోసం ‘ అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని సూచించారు. ఐఎంజీ కేసులో తప్పుచేయకుంటే బాబు ఎందుకోసం  భయపడుతున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు.