చంద్రబాబు యాత్రలో ‘ జై తెలంగాణ’

ఆదిలాబాద్‌: జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణవాదులు షాకిచ్చారు. పాదయాత్రలో ‘ జై తెలంగాణ’ నినాదాలు మార్మోగాయి. దీంతో బాబు ంగుతిన్నారు. తెలంగాణవాదులపైకి పోలీసులను ఉసిగొల్పారు. రెచ్చిపోయిన పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తెలంగాణవాదులను విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. పోలీసులు కవ్వింపు చర్చలకు పాల్పడొద్దని హెచ్చరించారు.