చర్చకు రాకుండా అడ్డుకున్నారు: దాడి

హైదరాబాద్‌: నీలం తుపాను ప్రభావంతో రైతుల సమస్యలపై శాసనమండలిలో చర్చకు రాకుండా ముఖ్యమంత్రి అడ్డుకున్నారని తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు  ఆరోపించారు. నీలం తుపానుపై మండలిలో చర్చ జరుగుతుందని ఆశించిన రైతుల ఆశలకు ముఖ్యమంత్రి గండికోట్టారని ఆయన విమర్శించారు. నీలం తుపానుతో నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని దాడి డిమాండ్‌ వ్యక్తం చేశారు.