చర్లపల్లి నుంచి పరారైన జీవితఖైదీ

హైదరాబాద్‌(కాప్రా): చర్లపల్లి కేంద్ర కారగారం నుంచి ఈరోజు ఒక జీవితఖైదీ పరారయ్యాడు. షాబాద్‌ మండలం కొత్తూరుకు చెందిన కె.కృష్ణయ్య(36) 2004లో అన్నను హత్య చేసిన కేసులో ప్రధాన నిందుతుడు. 2007లో న్యాయస్థానం అతనికి జీవితఖైదు విధించింది. జైలులో అతను సత్ప్రవర్తన గల ఖైదీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో అదికారులు గేటు దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంటీన్‌లో సేల్స్‌మాన్‌గా అతడిని నియమించారు. ఈరోజు మథ్యాహ్నం విథులకు వచ్చిన అతను అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. జైలు అధికారులు పోలిసులకు సమాచారం ఇచ్చారు.