చార్మినార్‌ ప్రాంతంలో పర్యటించిన కమిషనర్‌

హైదరాబాద్‌: ఈరోజు చార్మనార్‌ ప్రాంతంలో నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ పర్యటించారు. పాతబస్తీలోని గణేశ్‌ మండపాల భద్రత దృష్ట్యా పోలీసు అధికారులు పీన్‌ కమిటీ సభ్యలతో చర్చలు జరిపారు. గణేశ్‌ నవరాత్రులు, నిమజ్జనం భద్రత దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చేప్పారు. నగరం నుంచి 5 వేల పోలీసు బలగాలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి 8 వేల మంది పోలీసులను భద్రత కోసం వినియోగిస్తున్నామన్నారు.