చింతల్‌నార్‌కు సమీపంలోనే ఎదురాకాల్పులు

ఖమ్మం : గతంలో మావోయిస్టులు జవాన్ల వూచకోతకు పాల్పడిన ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రా సరిహద్దు ప్రాంతం చింతల్‌నార్‌కు సమీపంలోనే ఈ ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. భారీగా ఆయుధాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 2011 మార్చిలో చింతల్‌నార్‌ వద్ద మావోయిస్టులు 70 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల వూచకోతకు పాల్పడిన విషయం తెలిసిందే.