చిత్తూరు జిల్లాలో కలప దొంగల బీభత్సం
చిత్తూరు,నవంబర్22: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం అత్తికుప్పం అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి కలప దొంగలు రెచ్చిపోయారు. అటవీ ప్రాంతానికి కాపలాగా ఉన్న ఇద్దరిని విచక్షణారహితంగా కత్తులతో పొడిచి బీభత్సం సృష్టించారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. వీరిని వెంటనే ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. అటవీ ప్రాంతంలో గస్తా ముమ్మరం చేశారు.



