చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
పాకాల :చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం గుంటగాదంకి వద్ద క్వాలిన్ వాహనం, కోళ్ల వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి పరిస్థి విషయంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


