చిరుధాన్యాలతో విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం

“చిరుధాన్యాలతో విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం”
ఫోటో రైట్ అప్:సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ పెన్ పహాడ్. మార్చి 25 (జనం సాక్షి) : విద్యార్థులు అందరూ పోషక ఆహార పదార్థాలను చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా శిశు సంక్షేమ అధికారి జ్యోతి పద్మ అన్నారు. శనివారం ఐసీడియస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ్ లో భాగంగా కస్తూరి భా గాంధీ బాలికల ఆశ్రమ విద్యానిలయంలో 30 మంది విద్యార్థులకు  రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి జ్యోతి పద్మ పాల్గొని మాట్లాడుతూ చిరు దాన్యాలు తీసుకోవడంవల్ల ఆరోగ్యం బాగుంటుందని ప్రతి ఒక్కరూ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని దాని ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు అని తెలిపారు అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు బాలింతలకు అందించే బాలామృతంతో పాటు చిరుధాన్యాలు చేసిన వంటకాలు తినిపించడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు కిషోర బాలికలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని కోరారు విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించి ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులకు షీల్డ్ అందజేశారు ఈ కార్యక్రమంలో తాశిల్దార్ శేషగిరి రావు, సిడిపివో కిరణ్మయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ స్రవంతి, ఎస్ ఓ ఆసియా జెబిన్, సూపర్ వైజర్లు వీరమ్మ, ఉపేంద్ర,ఆరోగ్య సిబ్బంది వీరమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు గుండపునేని ఊర్మిళ, విజయ, సుజాత, బుజ్జమ్మ,ఆశా కార్య కర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…