చీరాలలో భార్య గొంతుకోసిన భర్త
చీరాల : ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం జరిగింది. రాంనగర్ న్యూకాలనీలో భార్య కాపురానికి రావటం లేదనే అక్కసుతో భర్త… ఆమె గొంతు కోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్తకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.



