చురుకుగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు

బాలాలయంలోనే బ్ర¬్మత్సవాల వేడుకలు
యాదాద్రి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  ఓ వైపు యాదాద్రి విస్తరణ,పునరుద్దరణ పనులు చురకుగా సాగుతున్న వేళ స్వామివారి బ్ర¬్మత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవాలకు సిఎం హాజరు అవుతారని సమాచారం. ఇటీవలే సిఎం కెసిఆర్‌ పర్యటించి పునరుద్దరణ పనులపై పలు సూచనలు చేశానే. ఒకవేళ బ్ర¬్మత్సవాలకు వస్తే మరోమారు ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పనులపై తగు సూచనలు చేసిన సిఎం వాటి పురోగతిని ఈ సందర్భంగా పరిశీలించ నున్నారు. కల్యాణోత్సవానికి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దంపతులు హాజరై పటువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నరని తెలుస్తోంది. దీంతో ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం పెరుగనున్నది. పదకొండురోజులపాటు వైభవోపేతంగా సాగనున్న ఉత్సవాలకు వేలాదిమంది తరలిరానుండడంతో అధికార యంత్రాం గం ఏర్పాట్లు చేసింది. ఈ యేడు కూడా  బాలాలయంలో బ్ర¬్మత్సవాలు వైభవంగా జరుగుతాయి. బ్ర¬్మత్సవాల సందర్భంగా ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని బ్ర¬్మత్సవాలను విజయవంతం చేయాడానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ సవిూక్షించనున్నారు. కరెంట్‌ సరఫరాకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రధానమైన చర్చ జరుగుతుంది. నిరంతర కరెంట్‌ సరఫరాతో లైటింగ్‌ అందాలు రాత్రి పూట కనువిందు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను తయారు చేసారు.