చెప్పింది చేస్తాం.. లక్ష 12వేల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం

మరో వెయ్యి ఉద్యోగాలు ఎక్కువే ఇస్తాం

– అంబేద్కర్‌ ఓవర్సీస్‌ పథకంకు పరిమితి లేదు

– ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలిస్తే స్వీకరిస్తం..

– అడ్డగోలుగా మాట్లాడితే గౌరవం ఉండదు

– అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఇండిపెండెంట్‌ రోజు గోల్కొండ్‌ కోట సాక్షిగా చెప్పిన విధంగా రాష్ట్రంలో లక్షా12వేల ఉద్యోగాలు 100శాతం భర్తీ చేసి తీరుతామని సీఎం కేసీఆర్‌ అన్నారు. మరో వెయ్యి ఎక్కువే భర్తీ చేస్తాం తప్ప తగ్గమని అన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో జోక్యం చేసుకున్న సిఎం కెసిఆర్‌ అంబేద్కర్‌ ఓవర్సీస్‌ పథకం, గ్రూప్‌-2 ప్రశ్నలపై సీఎం మాట్లాడారు. అంబేద్కర్‌ ఓవర్సీస్‌ పథకానికి పరిమితి లేదన్నారు. అర్హులందరికీ ఈ పథకం వర్తింపచేస్తామని సీఎం హావిూ ఇచ్చారు. ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు రూ. 20లక్షలకుపైగా ఇస్తున్నామన్నారు. బలహీన వర్గాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని సీఎం ఈ సందర్భంగా తెలియజేశారు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ ఉంటుందన్నారు. టీఎస్‌పీఎస్సీలో అనేక సంస్కరణలు చేపట్టిన ఘంటా చక్రపాణిని యూపీఎస్సీ అభినందించిందని సీఎం గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి అభినందన ఎప్పుడూ రాలేదని సీఎం తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో అభినందించాల్సిన ప్రతిపక్షాలు కేవలం రాజకీయం కోసం మాట్లాడటం తగదని సీఎం సూచించారు. ప్రతిపక్ష సభ్యులు నిర్మాణాత్మక సలహాలిస్తే స్వీకరిస్తం అన్న సీఎం కేసీఆర్‌… అదే సమయంలో అడ్డగోలుగా మాట్లాడితే గౌరవం ఉండదని హెచ్చరించారు. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బిల్లు తెచ్చిన తరువాత ఎంత డబ్బు

ఖర్చు చేశామనేది ప్రతి పైసాల ఎక్క జెబుతామని స్పష్టం చేశారు. దాదాపు 100కుపైగా పేజీలతో కూడిన పెన్‌డ్రైవ్‌లను కూడా ప్రతి సభ్యుడికి ఇవ్వబోతున్నామన్నారు. బలహీన వరగ్‌ఆల అభివృద్ధికోసం అనేక పథకాలను అమల్లోకి తెచ్చిన ఘనత తెరాసా ప్రభుత్వానిదేనని సీఎం పేర్కొన్నారు. నీతిఆయోగ్‌, కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్య ఇస్తున్న ఆవాసీయ విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. దీనిలో బాగంగా ఒక్కో విద్యార్థి విూద రూ. 1.20లక్షల ఖర్చు పెట్టి క్వాలిటీ విద్యను అందిస్తున్నామని, దీనికి దళిత అధికారి ప్రవీణ్‌కుమార్‌ పనిచేస్తున్నారని తెలిపారు. ఈ పథకాన్నే మైనార్టీలు, బడుగు వర్గాల పిల్లలకు అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. రాబోయే సంవత్సర కాలంలో చెప్పిన దానికంటే వెయ్యి ఉద్యోగాలు ఎక్కువగానే ఇస్తామని అన్నారు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగానే భర్తీ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు..